గురు పౌర్ణమిని పురస్కరించుకొని నిర్మల్ రూరల్ మండలంలోని న్యూ ముజ్గి లోని సాయిబాబా ఆలయంలో అంగరంగ వైభవంగా గురువారం వేడుకలు నిర్వహించారు. భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని బాబాకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. గురు పౌర్ణమి పురస్కరించుకొని పరిసర గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహించారు.