ఈదురుగాలుల బీభత్సంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది

నిర్మల్ జిల్లాలో ఈదురుగాలుల బీభత్సంతో చాక్‌పల్లి పెట్రోల్ పంప్ సమీపంలో భారీ వృక్షాల కొమ్మలు విరిగిపడి విద్యుత్ స్తంభాలు, వైర్లు దెబ్బతిన్నాయి. దీంతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. బూరుగుపల్లి (కే) సబ్ స్టేషన్ ఏఈ మధు ఆదేశాలతో లైన్ ఇన్స్పెక్టర్ శివన్న, లైన్ మెన్ సతీష్, ఏఎల్ఎం అవధూత్ ఉదయం 9 గంటలకే పనులు ప్రారంభించి, ప్రాణాలకు తెగించి కొమ్మలను తొలగించి, స్తంభాలను, వైర్లను సరిచేసి సరఫరాను పునరుద్ధరించారు. తక్షణమే స్పందించిన ఏఈ, సిబ్బందిని చాక్‌పల్లి గ్రామస్తులు, వాహనదారులు అభినందించారు.

సంబంధిత పోస్ట్