ఇంటి వద్దకే సీతారాముల తలంబ్రాలు

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచల సీతారామస్వామి కల్యాణోత్సవంలో ఉపయోగించిన తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేరవేసేందుకు టీజీఎస్ ఆర్టీసీ కార్గో ప్రత్యేక సేవలను అందుబాటులోకి తెచ్చింది. నిర్మల్ ఆర్టీసీ డిపో మేనేజర్ పండరి ఈ విషయాన్ని తెలిపారు. బుధవారం డిపోలో దీనికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. బస్టాండ్ లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఈ నెల 31 వరకు రూ. 151 చెల్లించినట్లయితే నేరుగా ఇంటికి తలంబ్రాలు పంపనున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్