జిల్లాలో 63. 2 మి. మీ వర్షపాతం నమోదు

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో సగటున 63.2 మి.మీ వర్షపాతం నమోదైంది. గురువారం అధికారులు ఈ వివరాలు వెల్లడించారు. అత్యధికంగా బాసరలో 110.4 మి.మీ వర్షం కురిసింది. ముధోల్, ఖానాపూర్, పెంబి, సోన్, బైంసా, కడెం, నిర్మల్ రూరల్, సారంగాపూర్, లక్ష్మణచందా, కుబీర్, నిర్మల్, తానూర్, దస్తురాబాద్, లోకేశ్వరం, మామడ, నర్సాపూర్ జి, దిలావర్పూర్, కుంటాల మండలాల్లోనూ గణనీయమైన వర్షపాతం నమోదైంది. ఈ వర్షపాతం జిల్లాలో జనజీవనాన్ని ప్రభావితం చేసింది.

సంబంధిత పోస్ట్