నిర్మలమ్మ బడ్జెట్ భేష్: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు ప్రశంసించారు. దేశాభివృద్ధి, ఆర్థిక క్రమశిక్షణ, మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం, రైతులు, యువతపై ప్రత్యేక దృష్టి సారించిన ఈ బడ్జెట్ కూర్పు అభినందనీయమని ఆయన అన్నారు. ముఖ్యంగా, శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన పంటగా ఉన్న కొబ్బరి కోలుకునేలా తోడ్పాటు అందించడం శుభపరిణామమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్