ముఖేష్ అంబానీ నివాసమైన ఆంటిలియా ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటి. వంటగదికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చే నీతా అంబానీ, దశాబ్దం క్రితం అక్కడికి వెళ్లే ముందు ప్రైవేట్ జెట్‌లో శ్రీలంకకు వెళ్లి జపాన్‌కి చెందిన నోరిటేక్ బ్రాండ్ నుంచి 22 క్యారెట్ల బంగారం, ప్లాటినంతో చేసిన ప్రత్యేక టీ కప్పుల సెట్‌ను కొనగోలు చేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీటికి సుమారు రూ.15 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఒక్క టీ కప్పు ధర రూ.3 లక్షలు ఉంటుందని తెలుస్తోంది.