289 రోజులుగా హాఫ్ సెంచరీ కోసం నితీష్ కుమార్ రెడ్డి నిరీక్షణ

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి 43 పరుగుల వద్ద ఔటయ్యారు. 54 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్‌లతో పరుగులు చేసిన నితీష్ హాఫ్ సెంచరీని అందుకోలేకపోయారు. గత 289 రోజులుగా అతని బ్యాట్ నుంచి ఒక్క హాఫ్ సెంచరీ కూడా రాలేదు. ఈ సమయంలో ఆడిన 8 ఇన్నింగ్స్‌లలో 13.14 సగటుతో 93 పరుగులు మాత్రమే చేశారు. అతని కెరీర్ తొలి సెంచరీ గత ఏడాది నవంబర్‌లో ఆస్ట్రేలియాపై చేశారు.

సంబంధిత పోస్ట్