‘మెంటల్ మది’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి నివేదా పేతురాజ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 2023లో కొన్ని తప్పు నిర్ణయాల కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని, డిప్రెషన్, పానిక్ అటాక్స్ను ఎదుర్కొన్నానని తెలిపారు. ఆ సమయంలో సినిమాలకు పూర్తిగా దూరమై హిమాలయాలకు వెళ్లి ధ్యానం చేస్తూ జీవించాలని కూడా భావించినట్లు చెప్పారు. ప్రస్తుతం మళ్లీ నటిగా బిజీగా ఉన్న నివేదా, త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.