ఆలూర్ చోరీ

ఆలూర్ మండల కేంద్రంలో తాళం వేసిన ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. బాధితుడు రాము కుటుంబసభ్యులు గత నెల 27న బంధువుల దినకర్మకు వెళ్లారు. మంగళవారం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి తాళం ధ్వంసమై ఉంది. బీరువాలోని 14 తులాల బంగారు ఆభరణాలు, అరకిలో వెండి, రూ. లక్ష నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, సంఘటనా స్థలాన్ని ఆర్మూర్ సీఐ సత్యనారాయణ సందర్శించి వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్