ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ ఉన్నత పాఠశాలలో వేదవ్యాస మహర్షి జయంతిని పురస్కరించుకుని గురుపూజోత్సవాన్ని గురువారం నిర్వహించారు. వ్యాస మహర్షిని పూజించిన అనంతరం ప్రధానోపాధ్యాయులు మద్దికుంట శ్రీనివాస్ విద్యార్థులకు జ్ఞానం వల్లే చీకటి తొలగి వెలుగు విరుస్తుందని, వ్యాసుడు మానవతా విలువలు బోధించిన మహాగురువు అని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.