నికాళ్‌పూర్ గ్రామంలో నూతన సబ్ స్టేషన్ భవనానికి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి భూమి పూజ చేశారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు సన్మానం చేసి, గ్రామ సమస్యలను వివరించారు. కొమట్పల్లి నుండి నికాళ్‌పూర్ రోడ్డులో బ్రిడ్జి మంజూరు అయిందని, డబుల్ రోడ్డు కూడా త్వరలో మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. 2 కోట్ల 53 లక్షల రూపాయల సబ్ స్టేషన్ మంజూరు కోసం గ్రామస్తులు పలుమార్లు తనను కలిసి విన్నవించుకున్నారని ఆయన పేర్కొన్నారు.