నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డులో బుధవారం బీజేపీ అభ్యర్థి పోల్కం శాంత వేణు ప్రచారం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధిని చూసి బీజేపీకి ఓటు వేయాలని ఆమె ఓటర్లను కోరారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రధాని అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పోల్కం వేణు, కార్యకర్తలు పాల్గొన్నారు.