ఆర్మూర్ మండలంలోని ఇస్సాపల్లి జెడ్పీ హైస్కూల్‌లో షీ టీమ్ అవగాహన కార్యక్రమం కానిస్టేబుళ్లు విఘ్నేష్, సుమతి నేతృత్వంలో జరిగింది. ఈవ్‌టీజింగ్, మహిళలపై వేధింపులపై అవగాహన కల్పించారు. బాధితులు భయపడకుండా షీ టీం నంబర్ 8712659795 లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు. పేర్లు గోప్యంగా ఉంచబడతాయని పేర్కొన్నారు.