ఆర్మూర్లోని మినీ స్టేడియంలో సోమవారం జూనియర్ బాలుర అంతర్ జిల్లాల హాకీ టోర్నమెంట్ కోసం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల హాకీ సెలక్షన్ నిర్వహించారు. ఈ నెల 9, 10, 11 తేదీలలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు 18 మంది ప్రతిభావంతులైన క్రీడాకారులను ఎంపిక చేశారు. ఎంపికైన జట్టు 8వ తేదీన ఉదయం నిజామాబాద్ నుండి బయలుదేరుతుందని నిజామాబాద్ జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షులు విశాఖ గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి సదమస్తుల రవణ తెలిపారు.