ఉర్దూ బోధనపై వివాదం.. ఉపాధ్యాయుడిపై దాడి

నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామంలోని భరత్ చంద్ర పాఠశాలలో ఉర్దూ బోధిస్తున్నారని భారతీయ జనతా పార్టీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఉపాధ్యాయుడిపై మానసికంగా దాడి చేసి గాయపరిచారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉర్దూను ద్వితీయ భాషగా ప్రకటించినప్పటికీ, యాజమాన్యంతో చర్చించాల్సిన నాయకులు ఒక వర్గానికి చెందిన ఉపాధ్యాయుడిపై దాడి చేయడం జరిగింది. పాఠశాల యాజమాన్యం మైనార్టీ విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో చేరడంతో ఉర్దూను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. ఈ దాడిని ఖండిస్తూ, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివారం పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేశారు. APCR అధ్యక్షులు అశ్ఫాక్ అహ్మద్ ఈ దాడిని ఖండించారు.

సంబంధిత పోస్ట్