రైతు భరోసా నిధుల జమపై సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసినందుకు కృతజ్ఞతగా, డొంకేశ్వర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు, రైతులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాపూరావు మాట్లాడుతూ, మండలంలోని 4,690 మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమయ్యాయని, రైతు సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్