ఆర్మూర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం

ప్రజల రక్షణ సురక్షితలో భాగంగా నిజామాబాదు పోలీసు కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం ఆర్మూర్ పట్టణంలోని స్థానిక రాజారామ్ నగర్ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 170 ఇళ్లు, సరైన ధ్రువపత్రాలు లభించని 76 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, 1 కారు తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇద్దరు రౌడీ షీటర్లు, 4 గురు సస్పెక్ట్ వ్యక్తులను చెక్ చేశారు. నంబర్ ప్లేట్లు లేని వాహనాలు 15, 2 ఆటోలను పోలీసు స్టేషన్కు తరలించారు.

సంబంధిత పోస్ట్