ఆదివారం ఉదయం ఆర్మూర్ పట్టణంలోని జెమ్మన్ జెట్టి గల్లిలో ఉన్న ఆదిత్య చికెన్ సెంటర్, కిరాణా దుకాణంలో గ్యాస్ సిలిండర్ లీక్ అయి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో సుమారు లక్ష రూపాయల ఆస్తి నష్టం సంభవించగా, కొండూర్ రుకుంబా యి, రాజేష్ అనే ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రాజేష్ చికెన్ దుకాణంతో పాటు కిరాణా దుకాణం కూడా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. చికెన్ వండుతుండగా సిలిండర్ పైపు ఊడి మంటలు అంటుకొని పక్కనే ఉన్న ప్లాస్టిక్ కుర్చీ, కిరాణా సామాగ్రికి వ్యాపించాయి.