వేల్పూర్ లో సీఎంఆర్ చెక్కులు పంపిణీ

వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ గ్రామంలో సీఎంఆర్ చెక్కుల పంపిణీ బుధవారం జరిగింది. మాజీ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, బాల్కొండ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో ఈ చెక్కులు పంపిణీ చేశారు. ఆరె పూజ, నోముల సురేఖ, బండారి రాజు, అంకన్న, ఈదుల వంశీ, జండా కాడి సాయిలు, గడ్డం చిన్న గంగారం, పూప్పల పవన్ అనే లబ్ధిదారులకు రూ. 3,32,000 పంపిణీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు గుడాల మోహన్ కిషన్, కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ టక్కరి గంగాధర్, నర్సారెడ్డి, హలీముద్దీన్, కృపానందం, నాచ్చన్న గారి గంగారెడ్డి, గట్టా తల చిన్న రాజన్న, రతీష్, శ్రీను, గంగ సాయిలు, రిజ్వాన్, నానితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్