ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, తన నియోజకవర్గంలోని అంకాపూర్ గ్రామానికి చెందిన అంబటి వైష్ణవి సంతోష్ దంపతుల కుమారుడు రామ్ చరణ్, బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అతన్ని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పిల్లలు తల్లిదండ్రులు గర్వపడేలా ఉండాలని, చదువుతోపాటు మానసికంగా, శారీరకంగా మంచి లక్షణాలు అలవర్చుకోవాలని సూచించారు. రామ్ చరణ్‌కు భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా తాను ముందుండి సహాయం చేస్తానని, మరింత ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు.