లక్కంపల్లి లో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ కై అనువైన స్థలాల పరిశీలన

నిజామాబాద్ జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి కృషి చేస్తున్నారు. బుధవారం నందిపేట మండలం లక్కంపల్లి సెజ్ పరిసర ప్రాంతాల్లో అనువైన స్థలాలను ఆయన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతిరెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రా, వినయ్ రెడ్డి, మరియు ఇతర ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుతో స్థానిక రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు. రైస్ బ్రాన్ ఆయిల్, సోయా పరిశ్రమల ఏర్పాటుకు కూడా కృషి జరుగుతోంది.

సంబంధిత పోస్ట్

✕
✕