ఆలూర్ లో రైతు భరోసా సంబరాలు..

ఆర్మూర్ మండలం ఆలూర్ లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దేగాం ప్రమోద్ ఆధ్వర్యంలో రైతు భరోసా సంబరాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేసిన సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ కాంగ్రెస్ ఇంచార్జి వినయ్ కుమార్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్