తక్కువ ధరకే ఇటుకలు పంపిస్తామని మోసం

ఆర్మూర్లో తక్కువ ధరకే ఇటుకలు సరఫరా చేస్తామని నమ్మించి పలువురిని మోసం చేసిన సంఘటన చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు, పెర్కిట్లోని కేవీఆర్ కాలనీకి చెందిన రన్డీర్ అనే ఇంటి యజమానిని సంప్రదించి, మార్కెట్లో రూ. 11 ఉన్న ఇటుకలను రూ. 9కే అందిస్తామని చెప్పారు. వారి మాటలు నమ్మిన రన్డీర్, 15,000 ఇటుకల కోసం రూ. 1.35 లక్షలు చెల్లించారు. అయితే, ఇటుకలు అన్లోడ్ చేసే సమయంలో కేవలం 6,900 ఇటుకలు మాత్రమే దింపడంతో, రూ. 85వేలు నష్టపోయానని రన్డీర్ గుర్తించారు. నిందితులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యారు. ఇదే తరహాలో ఆర్మూర్లో మరో ఐదుగురిని కూడా సిమెంట్ ఇటుకల పేరుతో మోసం చేసినట్లు తెలిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్