నందిపేట మండలం కేంద్రంలోని పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి, పేకాట ఆడుతున్న 9 మందిని అరెస్టు చేశారు. ఎస్సై కే. వినయ్ తెలిపిన వివరాల ప్రకారం, సమాచారం మేరకు దాడి నిర్వహించగా, పేకాటరాయుళ్లతో పాటు రూ. 28,140 నగదు, ఏడు మొబైల్ ఫోన్లు, రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి, ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.