పేలిన గ్యాస్ సిలిండర్.. తల్లి, కొడుకుకి తీవ్ర గాయాలు (వీడియో)

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని మున్సిపల్ సమీపంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. సిలిండర్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రుకుంబాయి అనే మహిళకు 70 శాతం వరకు కాలిన గాయాలు కాగా, ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన కుమారుడు రాజేష్ చేతులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన తల్లి, కొడుకులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్