కుటుంబానికి అండగా నిలిచిన హెల్పింగ్ హాండ్స్ సంస్థ

వేల్పూర్ గ్రామానికి చెందిన మంగలారపు హరీష్ మెదడులో రక్తం గడ్డకట్టడంతో నిమ్స్ లో సర్జరీ చేయించుకున్నారు. మూడు నుంచి నాలుగు లక్షల ఖర్చుతో పాటు, కుల వృత్తి చేసుకునే నిరుపేద కుటుంబం కావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో, హరీష్ సోదరుడు అరుణ్ సోషల్ మీడియాలో చేసిన అభ్యర్థనకు స్పందించి, హెల్పింగ్ హాండ్స్ సంస్థ రూ. 15,000 ఆర్థిక సహాయం అందించింది. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్