డ్రంకెన్ డ్రైవ్లో జైలు, జరిమానా

నందిపేట మండల కేంద్రంలో ఈ నెల 9న నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన బోధన్కు చెందిన నసీరుద్దిన్కు ఆర్మూర్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు సోమవారం ఏడు రోజుల జైలు శిక్ష విధించింది. ఇదే రోజు మద్యం తాగి వాహనాలు నడిపిన మరో ముగ్గురికి ఒక్కొక్కరికి రూ. 10వేల చొప్పున జరిమానా విధించినట్లు ఎస్సై కె వినయ్ తెలిపారు. ఈ తీర్పు డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో కఠిన చర్యలకు నిదర్శనంగా నిలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్