నందిపేట్ లో ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ లోని నందిపేట పట్టణంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ వాది శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతిని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలిన, బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడిన బాపూజీని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు చందన్ గంగాధర్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕