నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం గోవింద్పేట్ గ్రామంలో భర్తను భార్య, ఆమె ప్రియుడు కలిసి గొంతు నులిమి హత్య చేసిన ఘటన గురువారం చోటుచేసుకుంది. మెదక్ జిల్లాకు చెందిన బుసవెల్లి దుర్గయ్య (36) తన భార్య మంజులితో కలిసి గోవింద్పేట్ గ్రామంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంజులకు అదే గ్రామానికి చెందిన సంజీవ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడటంతో, భర్త అడ్డు వస్తున్నాడని భావించి, ఇద్దరూ కలిసి దుర్గయ్యను హత్య చేశారు. మృతుడి చెల్లి బంటు విజయ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.