గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి

గురువారం పెర్కిట్లోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై, బాల్కొండ మండలం బోదెపల్లి గ్రామానికి చెందిన సుధాకర్ (48) ఎక్సెల్ వాహనంపై ఆర్మూర్ వస్తుండగా మీనాక్షి ఫంక్షన్ హాల్ ఎదుట గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుధాకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్