సికింద్రాపూర్ - కేశ్ పల్లి బ్రిడ్జి శాశ్వత పరిష్కారం చూపండి.

ఆర్మూర్ మండలంలోని సికింద్రాపూర్, కేశ్ పల్లి రాకపోకల బ్రిడ్జి వద్ద వర్షపు నీరు నిల్వ ఉండటం వల్ల వాహనాలు అదుపుతప్పుతున్నాయని, ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని సర్పంచ్ అరుణ్ కుమార్ తెలిపారు. ఎన్ హెచ్ అధికారులకు పలుమార్లు మరమ్మతులు చేపట్టినప్పటికీ, వర్షపు నీరు వెళ్లే మార్గం లేదని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన కోరారు. ఈ సమస్యపై ఎన్ హెచ్ అధికారులు వెంటనే స్పందించి పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్