పచ్చర్ల గ్రామా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతి

ఆలూర్ మండలం మాచర్ల గ్రామ సర్పంచ్ కట్ట నర్సయ్య, గురువారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌ను మర్యాదపూర్వకంగా కలిసి గ్రామ అభివృద్ధికి సంబంధించిన వినతిపత్రాన్ని అందజేశారు. మాచర్ల–వెల్మల్ లింక్ రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో పాటు, గ్రామంలో వీధి విద్యుత్ దీపాల ఏర్పాటు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ సానుకూలంగా స్పందించినట్లు సర్పంచ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్