బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి, బైక్ ర్యాలీతో నిరసన తెలిపారు. కేసీఆర్ కు సీట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.