తాగుడుకు బానిసై నిత్యం వేధింపులకు గురిచేస్తున్న తనయుడిని కన్నతండ్రే కత్తితో పొడిచి హత్య చేసిన దారుణం మంగళవారం రాత్రి ఒడ్యాట్పల్లిలో చోటుచేసుకుంది. మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం, ఓడ్యాట్పల్లి గ్రామానికి చెందిన నవీన్ (30) తాగుడుకు బానిసై కుటుంబ సభ్యులను వేధించేవాడు. మంగళవారం రాత్రి సైతం తాగి ఇంటికి వచ్చి తండ్రి నడ్పి గంగాధర్తో గొడవపడగా, ఆగ్రహించిన తండ్రి నవీన్ కంట్లో కారం కొట్టి, కత్తితో పొడిచి హత్య చేశాడు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.