విద్యార్థులకు చేతిరాత మెరుగుదలపై ప్రత్యేక శిక్షణ

ఆర్మూర్ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో చిట్ల ప్రమీల జీవన్ రాజ్ మెమోరియల్ ట్రస్ట్ సౌజన్యంతో, రిటైర్డ్ ఐఏఎస్ చిట్ల పార్థసారథి ఆధ్వర్యంలో 9, 10వ తరగతి విద్యార్థులకు ‘చేతిరాత మెరుగుదల’ శిక్షణ విజయవంతంగా జరిగింది. ఉదయం 10 నుండి సాయంత్రం 4: 15 వరకు జరిగిన ఈ వర్క్‌షాప్‌లో నేషనల్ హ్యాండ్‌రైటింగ్ అకాడమీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ రావు పాల్గొని, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో అందంగా, వేగంగా రాసే మెలకువలను విద్యార్థులకు సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రవీందర్, పి. లక్ష్మినరసయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕