లయన్స్ క్లబ్ ఆఫ్ నందిపేట్ ఆధ్వర్యంలో శనివారం నందిపేట్ మండల కేంద్రంలోని గీత స్కూల్ లో చదువుతున్న విద్యార్థులు రాష్టస్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక అయిన పొలపల్లి నందిత , మందజి నిహారిక, మంతెన అక్షర జోగిని, ప్రేమలత, కనుగుల దీక్షిత్ విద్యార్థులను సన్మానించి వారిని అభినందించారు. రాష్ట స్థాయిలో మంచిగా రాణించి మన మండలానికి చదువుతున్న పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మంద మహిపాల్, సెక్రటరీ గంగుల గంగాధర్, ట్రెజరర్ దేవుడు నరేష్, సభ్యులు గంగుల చిన్నయ్య, గంగుల జనార్దన్, జక్కుల నవకాంత్, పాఠశాల ప్రిన్సిపాల్ కానూరి సాగర్, పీఈటీ ముత్యం తదితరులు పాల్గొన్నారు.