నందిపేట్ లో మహాత్మా గాంధీకి ఘన నివాళులు

ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు నందిపేట్ మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద గాంధీజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దూడ వెంకటేష్ మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతీయులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి సత్యం, అహింస మార్గంలో అనేక ఉద్యమాలు నిర్వహించారని అన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕