ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో శుక్రవారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆర్మూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురకంటి చిన్నారెడ్డి, విడిసి అధ్యక్షుడు మేడిపల్లి శ్రీకాంత్ లు వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయని, సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారన్నారు.