ఉపాధ్యాయుడు మహమ్మద్ అబ్దుల్ వకీల్ కు ఘన వీడ్కోలు

బాల్కొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత కొన్ని సంవత్సరాలుగా విధులు నిర్వహించి, విద్యార్థులకు ఉత్తమ విద్యాబోధన అందించిన ఉపాధ్యాయుడు మొహమ్మద్ అబ్దుల్ వకీల్ కు బుధవారం ఘన వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ, వకీల్ తన వృత్తి జీవితంలో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచడానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. పదవీ విరమణ అనంతరం తన అనుభవాలను విద్యాశాఖకు అందిస్తానని వకీల్ తెలిపారు.

సంబంధిత పోస్ట్