బాల్కొండ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

నిజామాబాద్ జిల్లా, బాల్కొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ వి. భుజంగరావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల మౌలిక వసతులు, బోధనా ప్రమాణాలు, ఉపాధ్యాయుల ఖాళీలు, మధ్యాహ్న భోజన నాణ్యత, తరగతి గదుల నిర్వహణపై ఆయన సమీక్షించారు. విద్యార్థుల హాజరు, బోధనా విధానాన్ని పరిశీలించి, విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్