బాల్కొండ లయన్స్ క్లబ్: కూలీలకు అంబలి పంపిణీ

నిజామాబాద్ జిల్లా, బాల్కొండలో మంగళవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు అంబలి పంపిణీ చేశారు. కిసాన్ నగర్ గ్రామానికి చెందిన కూలీలకు వారు పనిచేస్తున్న చోటుకే వెళ్లి ఈ సేవను అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి, ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి, లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకు లింగం, జోనల్ చైర్మన్ జ్ఞాన సాగర్ రెడ్డి, సర్పంచ్ రామరాజు గౌడ్, ఉప సర్పంచ్ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా కూలీలకు పని ప్రదేశంలోనే పోషకాహారం అందించడం జరిగింది.

సంబంధిత పోస్ట్