పదో తరగతి ఫలితాలు: భీంగల్ విద్యార్థుల అద్భుత ప్రతిభ, 98% ఉత్తీర్ణత

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్ మండలంలో పదో తరగతి పరీక్షల్లో 813 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 800 మంది ఉత్తీర్ణులై 98% ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 403, బాలికలు 397 మంది విజయం సాధించారు. ఆక్స్ఫర్డ్ స్కూల్‌కు చెందిన ఇర్ల నిహారిక 545 మార్కులతో స్కూల్ టాపర్‌గా నిలిచింది. మండలంలో 456 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం విశేషం. ఈ ఫలితాలు భీంగల్ విద్యార్థుల ప్రతిభను మరోసారి చాటి చెప్పాయి.

సంబంధిత పోస్ట్