భీంగల్ మండలం చేంగల్ గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ శోభన్, ఆయన భార్య , బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు లావణ్య శనివారం కాంగ్రెస్‌లో చేరారు. బాల్కొండ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. స్థానిక ఎన్నికల్లో విజయం సాధించేలా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.