నిజామాబాద్ జిల్లా, బాల్కొండలోని ముప్కాల్ మండలంలో వేంపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో బుధవారం ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్ వైజర్ మాధవి ముఖ్యఅతిథిగా పాల్గొని, గర్భిణీలు, బాలింతలకు ముర్రుపాలు, పోషకాహారం ప్రాముఖ్యతను వివరించారు. సర్పంచ్ మహేష్ యాదవ్, కార్యదర్శి లత, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడి టీచర్లు, మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.