బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామంలో టైలరింగ్ కోర్స్ పూర్తి చేసుకున్న 22 మంది మహిళలకు మంగళవారం సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. భారత ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కలిగిన సాపియా అనలిటిక్స్, సక్షమ్, నోడల్ ఏజెన్సీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిక్షణ జరిగింది. శిక్షణ తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, స్వయం ఉపాధికి దోహదపడుతుందని శిక్షకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామ్ రాజ్ గౌడ్, ఉప సర్పంచ్ స్వామి నాథ్, కార్యదర్శి శ్రీనివాస్, కారోబార్ భూమారెడ్డి, సంస్థ ప్రతినిధులు, శిక్షకులు, అభ్యర్థులు పాల్గొన్నారు.