మెండోరాలో చైన్స్నాచింగ్

మెండోరామండలంలోని 44వ జాతీయ రహదారి బుస్సాపూర్ వద్ద శనివారం మధ్యాహ్నం మహిళా మెడలోంచి ఓవ్యక్తి రెండు తులాల బంగారు గొలుసు లాక్కెళ్లిన ఘటన కలకలం రేపింది. సోన్పేట్ గ్రామానికి చెందిన ఉప్పరి గణపతి తన కూతురు గంగుతో కలిసి ముప్కాల్ నుంచి సోన్పేట్ గ్రామానికి వెళ్తుండగా, బుస్సాపూర్ యూటర్న్ సమీపంలో వెనుక నుంచి బైక్పై వచ్చిన వ్యక్తి గంగు మెడలోంచి 2 తులాల బంగారు గొలుసు లాక్కుని ముప్కాల్ వైపు పరారైనట్లు బాధితురాలు తెలిపారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్