నిజామాబాద్ జిల్లా, బాల్కొండలోని పిప్రి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను గురువారం పంపిణీ చేశారు. 7 మంది లబ్ధిదారులకు రూ. 2,04,000 విలువైన చెక్కులను అందజేశారు. పేద ప్రజలకు అండగా, వారి ఆర్థిక సాయం మెరుగుపరుస్తూ, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ చెక్కులు పంపిణీ చేయడం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రంజిత్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్, రాజేష్ పాల్గొన్నారు.