నల్లూర్ లో రొటీన్ ఇమ్యునైజేషన్ రీచ్ అవుట్ సెషన్ నిర్వహణ

ముప్కాల్ మండలంలోని నల్లూర్ నెహ్రూనగర్ సబ్‌ సెంటర్‌లో రొటీన్ ఇమ్యూనైజేషన్ రీచ్ అవుట్ సెషన్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వైద్యాధికారి డా. మద్దుల రాకేష్, సబ్‌ యూనిట్ ఆఫీసర్ చి. హెచ్. మురళి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్‌ల నిల్వ, వ్యాక్సిన్ క్యారియర్లు, ఐస్ ప్యాక్‌లు, సంబంధిత రిజిస్టర్లను తనిఖీ చేశారు. అలాగే మాతా–శిశు ఆరోగ్య (MCH) సూచికలను సమీక్షించి, టీకా కార్యక్రమం అమలు తీరును పరిశీలించారు. అర్హులైన చిన్నారులు, గర్భిణీలు మరియు బాలింతలకు నిర్దేశిత ఆరోగ్య సేవలు సక్రమంగా అందేలా సిబ్బందికి సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕