తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, బాల్కొండ మండల మాజీ అధ్యక్షుడు గున్నాల వెంకటేష్ గౌడ్ ఆదివారం ఢిల్లీలో తమిళనాడు పీసీసీ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మోహన్ రెడ్డి మాట్లాడుతూ, మాణిక్యం ఠాగూర్ నూతన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించాలని, ఆయన సమర్థ నాయకత్వంలో తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చెంది ప్రజల విశ్వాసాన్ని చూరగొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.