పదో తరగతి విద్యార్థులకు స్నాక్స్ పంపిణీ ప్రారంభం

తెలంగాణలోని పి ఎం శ్రీ ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం ఈనెల 28 నుండి సాయంత్రం వేళల్లో స్నాక్స్ అందించడం ప్రారంభించింది. పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మార్చి 10వ తేదీ వరకు 34 పని దినాల పాటు ఈ స్నాక్స్ అందజేయనున్నారు. ప్రత్యేక తరగతుల సమయంలో అందించే ఈ స్నాక్స్ లో ఉడకబెట్టిన పెసర్లు, పల్లీలు-బెల్లం, మిల్లెట్‌ బిస్కెట్లు, ఉడకబెట్టిన బొబ్బర్లు, ఉల్లిపాయల పకోడి, ఉడకబెట్టిన శనగలు వంటివి ఉంటాయి. ఈ కార్యక్రమం విద్యార్థుల హాజరు, ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుందని మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్